: పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఈ రోజు శ్రీ‌కాకుళంలో జ‌న‌సేన‌ పార్టీ కోసం ఎంపిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ... ఈ ఎంపిక‌ల్లో యువ‌త ఉత్స‌హంగా పాల్గొంటున్నార‌ని, పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తామ‌ని అన్నారు. త‌మ‌కు అందిన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. విజ‌య న‌గ‌రం నుంచి జ‌న‌సేన‌కు వ‌చ్చిన ద‌రఖాస్తుల వివ‌రాల‌ను ప‌వ‌న్ వెల్ల‌డిస్తూ.. మొత్తం 2 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఈ నెల 20, 21న విజ‌యన‌గ‌రంలోనూ జ‌న‌సేన శిబిరం ఉంటుంద‌ని తెలిపారు. కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన శిబిరాల గురించి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయనగరం లో ఈ నెల 20, 21 న జనసేన శిబిరం.

Complete list : https://t.co/47DoPxcLS4 pic.twitter.com/PLRJuZPyga
— JanaSena Party (@JanaSenaParty) May 17, 2017

• Loading...

More Telugu News