: ‘అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను కిడ్నాప్ చేసిన వ్యాపారి’ కేసులో పురోగతి
హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి తన వద్ద తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించకపోవడంతో ఓ వడ్డీ వ్యాపారి అతడి భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ అంబర్ పేటకు చెందిన వాచ్ మెన్ శ్రీనివాస్ కు రూ.5 లక్షలు అప్పు ఇచ్చాడని, ఈ క్రమంలోనే అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయన భార్యను వ్యాపారి ఎత్తుకొచ్చాడని చెప్పారు. ఈ రోజు ఈ కేసులో పురోగతి సాధించామని, ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారని వివరించారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ నిందితులని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని చెప్పారు.