: చంద్రబాబు సర్కారును తక్షణం డిస్మిస్ చేయండి: రాష్ట్రపతి, ప్రధానిలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కట్జూ లేఖ
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారి హక్కులను హరిస్తున్న నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. పొలిటికల్ పంచ్ అడ్మినిస్ట్రేటర్ రవికిరణ్ ను అరెస్టు చేయడాన్ని ఖండించిన ఆయన, ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ, తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఈ విషయమై రాష్ట్రపతికి, ప్రధానికీ ఓ లేఖను రాస్తూ, కార్టూన్లు భావ ప్రకటనా హక్కులో భాగమని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, అది ఆర్టికల్ 19 (1) ఏ కింద ఇవ్వబడిన హక్కని అన్నారు. ప్రజలే ప్రభువులైన ఇండియాలో పాలకులను విమర్శించే హక్కు ప్రజలకుందని, కానీ, సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు అనాగరికంగా, అప్రజాస్వామికంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్టికల్ 356ను ప్రయోగించి, తక్షణం ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
I appeal to @RashtrapatiBhvn @PMOIndia to dismiss the @ncbn govt over the unconstitutional arrest of cartoonist Ravi Kiran under Article 356 pic.twitter.com/6Sc2RZxe5S
— Markandey Katju (@mkatju) May 16, 2017