: నల్గొండ జిల్లాలో బిజీబిజీగా నారా బ్రాహ్మణి
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ఈ రోజు నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో బిజీబిజీగా ఉన్నారు. అక్కడి హెరిటేజ్ ఫుడ్స్‌లో ఈ రోజు రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన సంస్థ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాడి రైతులకు రుణాలను పంపిణీ చేశారు.