: సీఐడీ కస్టడీకి 1500 కోట్ల కుంభకోణం నిందితుడు వడ్డి మహేష్
1500 కోట్ల రూపాయల భారీ హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ ను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసు సీఐడీ కోర్టుకు బదిలీ కాకపోవడంతో నిన్న సీఐడీ అతనిని కస్టడీకి తీసుకోలేకపోయింది. అయితే చట్టపరమైన లాంఛనాలు పూర్తి కావడంతో నేడు అతనిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు కేవలం మహేష్ ను మాత్రమే అదుపులోకి తీసుకుని, విచారించారు. సీఐడీ కస్టడీ అనంతరం కోల్ కతాలోని నిందితులతోపాటు, అతని తండ్రి, ఇతరులను కూడా సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.