: అవును, రష్యాతో సమాచారం పంచుకున్నాను...నాకా అధికారం ఉంది: ట్రంప్

రష్యా రాయబారితో కీలక సమాచారం పంచుకున్నారని, అమెరికా భద్రతకు నష్టం కలిగించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, నిరసనలు ప్రారంభమైన సందర్భంగా... వైట్ హౌస్ ముందుకు వచ్చి...వాషింగ్టన్ పోస్టు కథనం ఊహాజనితమని, అందులో వాస్తవాలు లేవని, అధ్యక్షుడు రహస్య సమాచారం పంచుకోలేదని ప్రకటన విడుదల చేసింది. ఆ తరువాత కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన విడుదల చేశారు.

అందులో 'అవును, అమెరికా అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలను రష్యాతో పంచుకున్నాను' అంటూ సంచలన ప్రకటన చేశారు. తీవ్రవాదం, విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కొన్ని వాస్తవాలను రష్యా ఉన్నతాధికారులకు చెప్పానని ఆయన తెలిపారు. అలా చెప్పే సంపూర్ణ అధికారం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. మానవతాదృక్పథంతోనే తాను రష్యాకు ఆ సమాచారం అందించానని ఆయన అన్నారు. సిరియాతో పాటు పలు దేశాల్లో విస్తరిస్తున్న ఐసిస్‌ తో పాటు తీవ్రవాదంపై పోరాటంలో రష్యా కలిసిరావాలని, రష్యా పోరును మరింత తీవ్రం చేయాలని తాను కోరుకుంటున్నందున అవసరమయిన సమాచారాన్ని తాను పంచుకున్నానని ఆయన స్పష్టం  చేశారు. దీంతో అమెరికన్ల నిరసనలు మరింత తీవ్రమవుతున్నాయి. 

More Telugu News