: నల్గొండలో మూడేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోంది: ఎమ్మెల్యే కోమటి రెడ్డి
నల్గగొండలో మూడేళ్లుగా రౌడీరాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్లగొండ ఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ బత్తాయి మార్కెట్ యార్డు ఏర్పాటు రైతుల చిరకాల వాంఛ అని, మంత్రి హరీశ్ రావుకు కృతఙ్ఞతలు తెలిపేందుకే సభకు వెళ్లానని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీల ఘటన మరవకముందే, నల్గొండలో రైతులపై రాళ్ల దాడి చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో దరిద్రమైన పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల శాపం తగులుతుందని ఆయన విమర్శించారు.