: బీజాపూర్ లో భారీగా కాల్పులు... 20 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్ లో ఈ రోజు మావోయిస్టులు, జవాన్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో మొత్తం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సుక్మా జిల్లాలోని చింతల్నార్, చింతగుఫా ప్రాంతాల్లో 8 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్ జవాన్లు అరెస్టు చేశారు. ఎదురు కాల్పుల ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇటీవలే మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్లు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.