: హైదరాబాద్‌లో రహదారిపై కాంగ్రెస్ నేతల భిక్షాటన
హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు భిక్షాటన చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. బ్యాంక్ ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనపడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, తమ డబ్బు తాము తీసుకోలేని పరిస్థితి ఉందని పేర్కొంటూ నగరంలో వారు భిక్షాటన నిర్వహించారు. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు అక్కడి రహదారిపై భిక్షాటన చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఎంతో సహకరించారని, ఇప్పుడు మాత్రం నగదు నిల్వల విషయంలో సర్కారు పూర్తిగా విఫలమైందని వారు అన్నారు. తెలంగాణలో నగదుకొరత మరీ ఎక్కువైందని మోదీ, కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.