: 'బాహుబలి'ని తప్పు పట్టాను... రాజమౌళికి క్షమాపణలు: కేఆర్కే
బాహుబలి-2 కలెక్షన్లతో ప్రముఖ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కు జ్ఞానోదయం అయినట్టుంది. ఈ సినిమా విడుదలైన కొత్తల్లో, దీన్ని చెత్త సినిమా అని, ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని, రానా ఇడియట్ అని తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యాఖ్యానించి విమర్శలు కొని తెచ్చుకున్న కమల్, ఇప్పుడు రాజమౌళికి క్షమాపణలు చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించి తాను తప్పుడు రివ్యూను ఇచ్చినందుకు సారీ అని అన్నాడు. తనకు నిజంగా సినిమా నచ్చలేదని, కానీ జనాలకు నచ్చిందని, జనం మాట దేవుడి వాక్కుతో సమానమని అన్నాడు. అందువల్ల రాజమౌళికి క్షమాపణలు చెబుతున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు.