: బయట మద్దతిస్తామంటారు... లోపల గొడవ చేస్తారు.. ఇదేం విధానం?: విష్ణు కుమార్ రాజు


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపట్ల బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన ఏపీ శాసనసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తీరును ఖండించారు. సభ బయట జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామంటారు... సభ లోపల బిల్లుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు... ఏంటీ విధానం? అంటూ ప్రశ్నించారు. ఈ తీరు మార్చుకోవాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాలకోసం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. 

  • Loading...

More Telugu News