: హోండా నుంచి రూ.13 లక్షల బైక్.. ముందస్తు బుకింగ్ ప్రారంభం
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) త్వరలో భారత్లో తొలి 1000 సీసీ సూపర్ బైక్ ‘ఆఫ్రికా ట్విన్’ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ బైక్ ధర రూ. 12.90 లక్షలు (ఢిల్లీ, ఎక్స్ షోరూం). ఈ బైక్కు ముందస్తు బుకింగ్లు ప్రారంభమైనట్టు పేర్కొన్న హోండా 50 ఆర్డర్లకే అది పరిమితమని తెలిపింది. హోండా సీఆర్ఎఫ్ 1000 ఎల్ ఆఫ్రికా ట్విన్గా వ్యవహరించే ఈ బైక్ జూలైలో మార్కెట్లోకి రానుంది. దేశంలోని 22 నగరాల్లో దీనిని విక్రయించనున్నారు.