: కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం
రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రెండు గంటలుగా మంత్రులతో చర్చిస్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో జీఎస్‌టీ బిల్లుకి ఆమోదం తెలపనున్నారు. రేపు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. అంతేగాక, ఏపీ రెంటల్ యాక్ట్‌కు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలపనుంది. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఏపీ యూత్ పాలసీ, రైతుల సమస్యలు వంటి అంశాలను కూడా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎటువంటి మీడియా సమావేశం ఉండబోదని తెలుస్తోంది.