: అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది: సింగపూర్ మంత్రి ఈశ్వరన్
ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. అమరావతిలో 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్-ఏపీ ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మందడంలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈశ్వరన్ మాట్లాడుతూ, 2015లో రాజధాని శంకుస్థాపనకు ఇక్కడికి వచ్చానని అన్నారు. సీఎం చంద్రబాబు ఊహించిన ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.