: మంత్రి నారాయణను పరామర్శించిన అశోక్ గజపతిరాజు


ఏపీ మంత్రి నారాయణను కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు   పరామర్శించారు. నెల్లూరులో నారాయణ నివాసానికి ఈ రోజు ఆయన వెళ్లారు. పుత్రశోకంలో ఉన్న నారాయణను ఆయన ఓదార్చారు. అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, నారాయణ కుమారుడు మృతి చెందడం బాధాకరమన్నారు. నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని, భూ సేకరణకు సంబంధించి నెలకొన్న సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. విమానయాన రంగం అభివృద్ధిలో భారత్ మొదటిస్థానంలో ఉందని, ఈ రంగంలో సరుకు రవాణాకు ప్రాధాన్యత పెంచుతామని, ఆదాయం పెంచేలా నూతన విధానం తీసుకువస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News