: మధురవాడలో కబ్జా చేసిన 100 కోట్ల రూపాయల విలువైన పదెకరాల భూమికి విముక్తి.. ప్రభుత్వం స్వాధీనం!

విశాఖపట్టణంలోని మధురవాడలోని సర్వే నంబర్‌ 331/5 లో 100 కోట్ల రూపాయల విలువైన పది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే...మధుమంచి రామకృష్ణ అనే కబ్జా రాయుడు మధురవాడ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 331/5 లోని పది ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డాడు. ఈ పదెకరాల భూమిలో 40 షెడ్డులను నిర్మించాడు. కలెక్టర్‌ చొరవతో ఈ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ యంత్రాంగం...తహసీల్దార్‌ ఫిర్యాదుతో రామకృష్ణపై కేసు నమోదు చేసింది. అనంతరం అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం ఆ భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.

More Telugu News