: హెలికాప్టర్ నడుపుతుండగా పైలట్ కు ఆకలేసింది... ఏం చేశాడో చూడండి!


ఆస్ట్రేలియా ప్రధాన పట్టణమైన సిడ్నీ మీదుగా ఒక హెలికాప్టర్ ఎగురుతోంది. ఇంతలో పైలట్ కు ఆకలేసింది. కిందికి చూస్తే మెక్ డోనాల్డ్స్ అవుట్ లెట్ కనిపించింది. అంతే.. హెలికాప్టర్ ను కిందికి దించి మెక్ డోనాల్డ్స్ అవుట్ లెట్ బటయ మైదాన ప్రదేశంలో పార్క్ చేసి, దర్జాగా నడచుకుంటూ షాపులోకి వెళ్లి తనకు కావాల్సినవి కొనుక్కుని,  ఆ పార్సిల్ చేతబట్టుకుని నేరుగా హెలికాప్టర్ ఎక్కి గాల్లోకి వెళ్లిపోయాడు. దీనిని వీడియో తీసిన స్థానికుడు ఒకరు దానిని అక్కడి న్యూస్ ఛానెల్ కు పంపడంతో ఇది కలకలం రేపింది.

కాగా, అక్క‌డి ల్యాండ్ ఓన‌ర్ అనుమతి ఇస్తే హెలికాప్ట‌ర్‌ ను ల్యాండ్ చేయ‌డం సాంకేతికంగా ఎలాంటి నేరం కాద‌ని ఆస్ట్రేలియా సివిల్ ఏవియేష‌న్ సేఫ్టీ అథారిటీ అధికార ప్ర‌తినిధి వెల్లడించారు. ఇలా ల్యాండ్ చేయడం అసాధార‌ణ‌మేన‌ని, అయితే అది సుర‌క్షిత‌మా? కాదా? అన్న‌ది వీడియో చూస్తేగానీ తెలియ‌ద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఆ పైల‌ట్ ఎవ‌రు అన్న‌ది తెలియ‌క‌పోయినా.. అత‌నే ఓ రేడియోలో మాట్లాడుతూ.. త‌న‌కు ల్యాండింగ్‌కు అనుమ‌తి ఉంద‌ని చెప్పారు. అప్పుడప్పుడూ తాము ఇలా చేస్తుంటామ‌ని కూడా ఆయన తెలిపారు.


  • Loading...

More Telugu News