: ట్రాఫిక్ జామ్‌తో నడిరోడ్డుపై అమ్మడి యోగా.. ఆమె స్టోరీ వైరల్!
ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని భావించిన ఓ యువతి కారు దిగి నడిరోడ్డుపై ఎంచక్కా యోగా చేస్తూ టైం పాస్ చేసింది. అంతేకాదు, ఆ సమయంలో తన భావాలను తాను పనిచేస్తున్న పత్రికల్లో రాయించింది. దీంతో ఆమె స్టోరీ కాస్తా వైరల్ అయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన.
దక్షిణ ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్.. మియామీ న్యూటైమ్స్ అనే పత్రికలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె కారులో మియామీ మీదుగా వెళ్తుండగా దారిలో ట్రక్కు బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. గంటలు గడుస్తున్నా ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసుగెత్తిపోయిన క్రిస్టిన్ కారు దిగి నడిరోడ్డుపై మండుటెండలో మ్యాట్ వేసుకుని యోగా చేస్తూ కూర్చుంది. తన కారు డ్రైవర్‌తో ఫొటోలు తీయమని చెప్పింది. రోడ్డుపై యోగా చేస్తున్న సమయంలో తనకెలా అనిపించిందో చెబుతూ తను పనిచేస్తున్న పత్రికలోనే ఓ కథనం రాయించింది. అది వైరల్ అయింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పడానికే ఇలా చేశానని అంటోంది క్రిస్టిన్.