: జార్ఖండ్ లో మావోయిస్టు కీలక నేత లొంగుబాటు!


జార్ఖండ్ మావోయిస్ట్ రీజనల్ కమిటీ కార్యదర్శి కుందన్ పహాన్ లొంగిపోయినట్టు రాంచీ సీనియర్ ఎస్పీ కుల్ దీప్ దివేది తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆర్కే మాలిక్, సీఆర్పీఎఫ్ ఐజీ సంజయ్ లత్కర్, డీఐజీ ఏవి హాంకర్, సీనియర్ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయాడన్నారు. కాగా, 2008లో స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఫ్రాన్సిస్ ఇంద్రవరన్ హత్య కేసులో ఇతను నిందితుడు. అదే ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంక్ కు చెందిన నగదు వాహనాన్ని లూటీ చేసి రూ.5 కోట్లు దోచుకుపోయిన కేసులో కూడా కుందన్ నిందితుడిగా ఉన్నాడు.  

  • Loading...

More Telugu News