: జగన్ తన పార్టీని మూసేసి టీడీపీలో విలీనం చేయాలి: మంత్రి ఆదినారాయణరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నానని చెప్పిన జగన్ తన పార్టీని మూసేసి టీడీపీలో విలీనం చేయాలని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీని రెండు అంశాల్లో విభేదిస్తున్నామని చెప్పిన జగన్, కేసుల విషయంలో మోదీ ఎదుట మోకరిల్లారని, 2014 మే 16న కౌంటింగ్ తర్వాత ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను జగన్ కలవడాన్ని తాను అప్పుడే వ్యతిరేకించానని అన్నారు. తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్.. ప్రధాని మోదీతో రాజీపడ్డారని, జగన్ ఓ కలుపుమొక్క అని, ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.