: ఢిల్లీలో ఏడు గంటలు మాయమైన చంద్రబాబు ఏం చేశారంటే..!


అమెరికా పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, ఆపై ఏడు గంటల పాటు కనిపించకుండా పోవడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న వేళ, ఆ సమయాన్ని కూడా పెట్టుబడుల వేటకే చంద్రబాబు కేటాయించారని, కొన్ని అనివార్య కారణాలతోనే విషయం బయటకు రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీకి వచ్చిన ఆయన, ఆపై ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎయిర్ బస్ తో పాటు కువైట్ కు చెందిన ఓ చమురు కంపెనీతో సమావేశమయ్యారని ఓ అధికారి తెలిపారు.

ఇన్వెస్ట్ మెంట్ పై ఓ అవగాహనకు రాకుండా వివరాలు బయటకు తెలియజేయవద్దని ఆయా కంపెనీలు షరతులు విధించడంతోనే విషయం బయటకు పొక్కలేదని అన్నారు. ఇటువంటి సమావేశాల వివరాలు వెల్లడైతే కంపెనీ షేర్ విలువపై ప్రభావం పడుతుందని, ఆ కంపెనీలు వెల్లడించినట్టు తెలుస్తోంది. తొలుత విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లోనే ఈ సమావేశం జరపాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఉన్న ఇతర ప్రముఖులకు అసౌకర్యం కలుగుతుందన్న ఆలోచనతో, పక్కన ఉన్న మరో భవనంలో చర్చలు సాగాయని, అంతకుమించి మరేమీ లేదని వెల్లడించారు.

  • Loading...

More Telugu News