: జీవిత భాగస్వామి గర్ల్ ఫ్రెండే... అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పిన హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టిన్ స్టెవార్ట్


హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టిన్ స్టెవార్ట్, తన అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పింది. కొంతకాలం నుంచి తాను సహజీవనం చేస్తున్న ఐర్లాండ్ మోడల్ స్టెల్లా మాక్స్ వెల్ ను వివాహం చేసుకోనున్నానని స్పష్టం చేసింది. 'పర్సనల్ షాపర్'తో పేరు తెచ్చుకున్న క్రిస్టీన్, తాను వివాహం చేసుకోబోయేది ఆడో, మగో ఇప్పటికిప్పుడు చెప్పలేనంటూ గతంలో వ్యాఖ్యానించి సంచలనం రేపింది. ఇప్పుడు స్టెల్లాతో పెళ్లి కోసం షాపింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలో వీరి పెళ్లి జరుగుతుందని, పెళ్లి దుస్తులు తదితరాలను కొంటున్నారని, వినూత్నంగా ఈ వేడుక ఉంటుందని తెలుస్తోంది.

కాగా, తాను లెస్బియన్ నని బహిరంగంగానే ప్రకటించుకున్న క్రిస్టీన్, గతంలో మరో సెలబ్రిటీ అలీసియా కార్గైల్ తో కొంతకాలం కలిసుంది. అంతకన్నా ముందు మాత్రం నటుడు రాబర్ట్ పాటిన్సన్ తో కొంతకాలం డేటింగ్ చేసిన క్రిస్టీన్, ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా స్టెల్లాను ఎంచుకుంది.

  • Loading...

More Telugu News