: చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వద్ద దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు వద్ద ఓ దుండగుడు ఈ రోజు బీభత్సం సృష్టించాడు. అక్కడ పనిచేస్తోన్న కార్మికులపై ఆ దుండగుడు కాల్పులతో విరుచుకుపడ్డాడు. దీంతో పది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బెలూచిస్థాన్‌లో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు చైనాలోని బీజింగ్‌లో ఈ రోజు రోడ్ అండ్ బెల్ట్ ఫోరమ్ ప్రారంభమైంది. అందులో చైనా-పాక్‌లు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ తరుణంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు తెలిపారు.