: బీజేపీ ఛీత్కారానికి గురికాక తప్పదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె


మిర్చి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నాన్ని బీజేపీ నేతలు మానుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. దత్తాత్రేయలాంటి నేతలు కూడా అవాస్తవాలు మాట్లాడటం బాధను కలిగిస్తోందని అన్నారు. మిర్చి రైతుల సమస్యల గురించి ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ...కేంద్రం మాత్రం చాలా ఆలస్యంగా, ఏమాత్రం స్పష్టత లేకుండా స్పందించిందని మండిపడ్డారు. తమ పార్టీని విస్తరించుకునే క్రమంలోనే బీజేపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు తమ ధోరణిని మార్చుకోకపోతే ప్రజలే ఛీకొడతారని అన్నారు. 

  • Loading...

More Telugu News