: కేసుల భయం కాకపోతే.. జగన్ ఎందుకు కలిశారు?: మంత్రి నక్కా
అక్రమాస్తుల కేసుల భయంతోనే ప్రధాని మోదీని వైసీపీ అధినేత జగన్ కలిశారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కేసుల భయం కాకపోతే... మోదీని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాన్ని ప్రజలకు జగన్ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. గత బుధవారం ప్రధాని మోదీతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, పోలవరం, అగ్రిగోల్డ్, ప్రత్యేక హోదా తదితర అంశాలపై మోదీతో చర్చించానని జగన్ తెలిపిన సంగతి కూడా విదితమే.