: భయంతో వణికిపోతున్న తండ్రిని ధైర్యంతో లాక్కొచ్చిన చిన్నారి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
గాజు వంతెనపై నడవటం అంటే కొందరికి సరదా.. మరి కొందరికి చచ్చేంత భయం. ఏమైనా ఆ అనుభవం సరదాగా ఉంటుందని అనుకున్నాడో వ్యక్తి. కనీసం ఆరేళ్లు కూడా నిండని తన కొడుకుతో అలా షికారుకెళ్లొద్దాం అని చెప్పిన ఆ తండ్రి.. ఆ చిన్నారిని తీసుకుని వెళ్లి వాన్షెన్ నేషనల్ పార్కు (చైనా) లో గాజు వంతెనపై నడిచాడు. అయితే, తనతో పాటు ఉన్న తన కొడుకుకి ధైర్యం చెబుతూ ముందు తీసుకువెళ్లాల్సిందిపోయి.. తానే భయంతో వణికిపోయాడు. గాజు వంతెనపై నడుస్తూ ఒక్కసారిగా కిందకి చూశాడు.. ఇక అంతే సంగతి.. అతడి గుండెలు జారిపోయాయి. ఇక ఆ వంతెనపై నుంచి బయటకు రావడానికి విపరీతంగా భయపడి అక్కడే కూలబడిపోయాడు.
అయితే, అతడి కుమారుడు మాత్రం గాజు వంతెనపై చలాకీగా నడిచాడు. తండ్రికి ధైర్యం చెప్పాడు. చెయ్యి పట్టుకొని వంతెనపై లాక్కెళ్లాడు. ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లందరూ ఆ బాలుడికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఆ పార్కులో కొండ చుట్టూ 330 అడుగుల ఎత్తులో 213 అడుగుల పొడవుతో ఈ గాజు వంతెన ఉంటుంది. ఈ చిన్నారి తన తండ్రికి ధైర్యం చెబుతూ ఎలా లాక్కెళుతున్నాడో మీరూ చూడండి..