: ఈ రోజే పెట్రోల్ కొట్టించుకోండి.. రేపట్నుంచి కొత్త నిబంధనలు!
రేపట్నుంచి పెట్రోల్ బంకులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి. ఇక నుంచి ఆదివారం నాడు పెట్రోల్ బంకులు పని చేయవు. ఇది రేపట్నుంచే అమలుకానుంది. అంతేకాదు, మే 15వ తేదీ (ఎల్లుండి) నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ బంకులు పని చేస్తాయి. తమ కొత్త నిబంధనల గురించి పలు పెట్రోల్ బంకుల్లో నోటీసులను కూడా అంటించారు.