: కరుణానిధి పుట్టిన రోజు వేడుకలకు అందుకే బీజేపీని ఆహ్వానించలేదట!


డీఎంకే అధినేత కరుణానిధి  వచ్చే నెల 3న తన 94వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలు, ఇతర ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అయితే, భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. ఈ విషయమై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతున్న తరుణంలో డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ అసలు విషయాన్ని చెప్పారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ద్రవిడ ఉద్యమాన్ని పారద్రోలడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించిన బీజేపీని, ఆ పార్టీ నేతలను ఆహ్వానిస్తే తమ వేదిక అసౌకర్యంగా మారుతుందని చెప్పారు. కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలు సమావేశమవడానికి ఈ వేడుకలు వేదికగా నిలవనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News