: హురియత్ నేతలను హెచ్చరించిన ‘హిజ్బుల్ ముజాహిదీన్’


తమ పోరాటంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ హురియత్ నేతలను ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ నేత జకీర్ ముసా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఒకటి జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప్ నిడివి సుమారు ఐదు నిమిషాలు ఉంది. కాగా, లెఫ్టినెంట్ హోదా కలిగిన యువ ఆర్మీ అధికారి ఉమర్ ఫయ్యజ్ ను హిజ్బుల్ ఉగ్రవాదులు ఇటీవల హతమార్చారు. ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను పోలీసులు ఈ రోజు విడుదల చేశారు. ఆ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు ప్రకటించారు.

  • Loading...

More Telugu News