: చీర కోసం విషం తాగి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని!


చీరకోసం ఓ విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తమిళ‌నాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని సురన్‌డైయిలో శివగురు నాథపురం కామరాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన శివగామి (18) అనే అమ్మాయి డిగ్రీ ఫ‌స్టియ‌ర్‌ చ‌దువుతోంది. ఇటీవ‌ల‌ శివగామి తల్లికి ఆమె బంధువు ఒకరు తన ఊరులో జరుగుతున్న ఆలయ వేడుక కోసం ఓ కొత్త చీర కొని గిఫ్టుగా ఇచ్చారు. కాగా, త‌న‌కు కూడా ఓ కొత్త‌ చీర కావాల‌ని ఆ అమ్మాయి త‌న‌ త‌ల్లిని అడిగింది. ఊరులో ఆలయ ఉత్సవాలు జరిగినప్పుడు చీర కొనిస్తామని ఆమెకు త‌ల్లి చెప్పింది. అయితే, శివ‌గామి ఊరుకోలేదు. త‌ల్లితో గొడ‌వ పెట్టుకుంది. త‌న‌ తల్లిదండ్రులు చీర కొనివ్వటం లేదంటూ మొన్న ఉద‌యం విషం తాగింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేకుండా పోయింది. పాళయంగోడు ఐకిరవుండు ఆసుపత్రిలో ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News