: హెచ్సీఎల్ కు నలభై ఐదు రోజుల్లోనే అనుమతులు ఇచ్చాం!: నారా లోకేష్

హెచ్సీఎల్ కంపెనీకి భూమి సహా అన్ని అనుమతులు కేవలం నలభై ఐదురోజుల్లో ఇచ్చామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, హెచ్సీఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అమరావతికి ఈ సంస్థ రావడంతో ఏపీ ఐటీ రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందన్నారు. హెచ్సీఎల్ కంపెనీ ఏర్పాటులో భాగంగా రూ.500 కోట్లు పెడుతుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి  మొదటి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. హెచ్సీఎల్ ఏర్పాటు ద్వారా ఐదు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రానున్నాయన్నారు.

More Telugu News