: రేపు నెల్లూరుకు వెళుతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుకు వెళుతున్నారు. హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. నిన్ననే నిషిత్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రబాబు అమెరికాలో ఉండటంతో ఆయన రావడం కుదరలేదు. కాసేపటి క్రితమే ఆయన అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు నెల్లూరులోని నారాయణ ఇంటికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.