: టీడీపీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసాల్లో సీబీఐ దాడులు


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, బెంగళూరు, హైదరాబాదుల్లోని ఆయన నివాసాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి, బ్యాంకు రుణం పొందారంటూ... ఐఎఫ్ సీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. 2014లో దాదాపు రూ. 190 కోట్ల రుణాన్ని ఆయన తీసుకున్నారని తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News