: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్లు.. భారత్, పాక్ మ్యాచ్ లపై అభిమానుల్లో ఆసక్తి!


వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచుల్లో గ్రూప్- బీలోని నాలుగు జ‌ట్ల‌లో సౌతాఫ్రికా, శ్రీ‌లంక‌ల‌తో పాటు భార‌త్‌, పాకిస్థాన్‌లు ఉన్నాయి. భార‌త్, పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులు అమిత‌మైన ఆస‌క్తిక‌న‌బ‌రుస్తారు. దానికి తోడు ఎంతో కాలం త‌రువాత భార‌త్‌, పాక్ క్రికెట్ జ‌ట్లు త‌ల‌ప‌డుతుండ‌డంతో ఆ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డే మ్యాచ్‌ల‌కు విప‌రీతంగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. వాటితో పాటు రెండు సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌కు ఇప్ప‌టికే టిక్కెట్ల‌ విక్రయం పూర్తయిందని నిర్వాహ‌కులు చెప్పారు.

మ‌రోవైపు యాషెస్‌ ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు ఆడే మ్యాచ్‌ల‌కు కూడా అధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపారు. వ‌చ్చేనెల‌ జూన్‌ 18న ఓవల్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు మంచి స్పందన లభించిందని, గత వారం రోజుల్లో 15,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పారు. మొత్తం 15 మ్యాచుల్లో ఎనిమిదింటికి టికెట్లన్నీ విక్రయించినట్లు తెలిపారు. గ‌త‌ ఛాంపియన్స్ ట్రోఫీని మించి ఈ సారి స్పంద‌న మ‌రింత పెరిగింద‌ని చెప్పారు. వ‌చ్చేనెల‌ 4న ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

  • Loading...

More Telugu News