: అతి తొందర్లోనే పవన్ కల్యాణ్ తో కలసి పనిచేస్తానేమో!: హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
భారతీయ సినిమా రికార్డులన్నింటినీ బద్దలుకొడుతూ దూసుకుపోతున్న ‘బాహుబలి-2’ సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ సినిమా కథ రాయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ సినిమాకి రచయితగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కోసం కథ రాసే అంశంపై స్పందించారు. ఆయన కోసం ఎందుకు రాయబోను? అని, తప్పకుండా రాస్తానని విజయేంద్రప్రసాద్ అన్నారు. అతి తొందర్లోనే పవన్ కల్యాణ్ తో కలసి పనిచేస్తానేమో? అని వ్యాఖ్యానించారు. రికార్డులు బద్దలు కొట్టిన ఎన్నో సినిమాలకు కథలు అందించిన ఆయన.. పవన్ సినిమాకు కూడా కథ రాస్తాననడంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.