: రుతుపవనాల తేదీలను ప్రకటించిన వాతావరణ శాఖ
ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాల రాక తేదీలను వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీకెల్లా అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఆపై వారం రోజులకు అంటే, 22 నాటికి కేరళను తాకుతాయని వెల్లడించారు. ఆపై మరో పది రోజులకు దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విస్తరిస్తాయని తెలిపారు. కాగా, ఈ సంవత్సరంలో సంతృప్తికరంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోగా, నైరుతీ రుతుపవనాలు, తొలకరి వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.