: భర్త నుంచి భరణం వద్దన్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ స్టార్ కపుల్ మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ లు తమ 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా కోర్టు వీరిద్దరికీ నిన్న అధికారికంగా విడాకుల నోటీసు జారీ చేసింది. అయితే, అర్భాజ్ ఖాన్ నుంచి ఒక్క పైసా భరణం కూడా మలైకా అరోరా అడగలేదట. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. వాస్తవానికి బాలీవుడ్ లో విడాకులు తీసుకోవడం సాధారణమే. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలను భరణంగా తీసుకున్నవారు కూడా ఉన్నారు. తన భార్య సుసానేకు ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ భరణం కింద రూ. 200 కోట్లు ఇచ్చాడు. అయితే, మలైకా మాత్రం భరణం అడగకపోవడం విశేషం.