: ట్రంప్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న కుజుడు... వినాశనం తప్పదు: భారతీయ జ్యోతిష్కుడు
యావత్ ప్రపంచ దేశాలు మూడో ప్రపంచం యుద్ధం వస్తుందేమోనని భయాందోళన చెందుతున్నాయి. అమెరికాను రక్షించుకునే క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్... అవసరమైతే అమెరికాను నాశనం చేస్తామంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ లు యుద్ధానికి సై అంటున్నారు. ఇప్పటికే ఉత్తరకొరియా సముద్ర జలాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మరోవైపు ట్రంప్ పై గ్రహాల ప్రభావం కూడా ఆయనను మరో ప్రపంచ యుద్ధంవైపు నడిపిస్తోంది. 2017 మే 13వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ట్రంప్ పై కుజుడు తీవ్ర ప్రభావాన్ని చూపుతాడని ప్రఖ్యాత భారతీయ జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ తెలిపారు. ఈ సమయంలో అమెరికా తీవ్ర హింసకు గురవుతుందని చెప్పారు. దీన్నుంచి అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ట్రంప్ చాలా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తారని... ఇదే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని తెలిపారు.