: 'నిజం చెప్పు... నేనిప్పుడు గర్భవతిని కూడా!' అంటూ కణతకు రివాల్వర్ గురిపెట్టుకుని పీటల మీద పెళ్లిని ఆపేసిన యువతి


సాధారణంగా సినిమా క్లైమాక్స్ లో పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద తాళి కట్టేందుకు సిద్ధంగా ఉన్నసమయంలో 'ఆపండి' అంటూ ఓ యువతి రావడం... పెళ్లి ఆగిపోవడం... చివరకు వధువు, హీరో కలవడంతో కథ సుఖాంతమవుతుంది. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా షివ్లిలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...దేవేంద్ర అవస్థి అనే యువకుడికి వివాహం జరుగుతోంది. బంధుమిత్రులంతా కళ్యాణవేదిక దగ్గర ఉత్సాహంగా ఉన్నారు. పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు.

కాసేపు ఆగితే పెళ్లి తంతు పూర్తయ్యేదే... ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ... ఒక యువతి రివాల్వర్ తో పెళ్లి మండపంలోకి వచ్చింది. 'ఆపండి' అంటూ పురోహితులకు చెప్పింది. అనంతరం తన కణతకు తుపాకీ గురి పెట్టుకుని... వరుడి వైపు చూస్తూ... 'ఇప్పుడు చెప్పు...నేనసలే గర్భవతిని కూడాను...మనం ప్రేమించి, పెళ్లి చేసుకోలేదూ?' అంటూ నిలదీసింది. దీంతో వరుడు నీళ్లు నమిలాడు. అనంతరం సదరు యువతితో ప్రేమాయణం, రహస్య వివాహం గురించి చెప్పాడు. దీంతో వధువు తల్లిదండ్రులు, వరుడికి ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News