: అభిమానుల అత్యుత్సాహంతో ధర్మేంద్రకు చిర్రెత్తుకొచ్చింది
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు అభిమానులపై ఆసహనం కలిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ధర్మేంద్ర వచ్చారు. దీంతో మీడియా ఆయనను చేరుకోగా... సినిమా షూటింగ్ ల కోసం తాను చాలా సందర్భాల్లో రాజస్థాన్ వచ్చానని, గతంలో బికనీర్ ఎంపీగా కూడా పని చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. వివాహానికి రాజస్థాన్ రావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లే సమయంలో అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. అభిమానుల అత్యుత్సాహంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో తన సిబ్బందిపై మండిపడ్డారు. కారెక్కడ? అంటూ గట్టిగా అరిచారు. అనంతరం కారు రావడంతో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు.