: నిషిత్ కు అరటిచెట్టుతో వివాహం చేసి... అక్కడే ఎందుకు అంత్యక్రియలు చేశారు?


రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు నిన్న నెల్లూరులోని పెన్నానదీ తీరంలో నిర్వహించారు. సాధారణంగా శ్రీమంతుల కుటుంబాల్లోని వ్యక్తులు మరణిస్తే, తమకు చెందిన వ్యవసాయ ప్రదేశాల్లో వారికి అంత్యక్రియలు నిర్వహించి, ఆ ప్రాంతంలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కానీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ విషయంలో అలాంటిది చోటుచేసుకోలేదు.

వాస్తవానికి నిషిత్ అంత్యక్రియలు నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే అవివాహితుడైన నిషిత్ అంత్యక్రియలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని, గతంలో ప్రముఖులు కూడా అలాగే చేసుకున్నారని పండితులు తెలిపారు. దీంతో నిషిత్ ఆత్మకు శాంతి కలిగేలా... ముందుగా నివాసం వద్ద నిషిత్ కు అరటి చెట్టుతో వివాహం చేశారు. అనంతరం గాలి, నీరు, నిప్పు కలిసి ఉండే చోట భూమ్యాకాశాల సాక్షిగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి స్థలానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంటుందని పండితులు చెప్పడంతో పెన్నానదీ తీరంలో నిషిత్ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించి, ఆ క్రతువును పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News