: ఈవీఎంల వాడకాన్ని వెంటనే ఆపేయండి.. అందులో అన్నీ మోసాలే: ములాయం


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అన్నీ లోపాలే ఉన్నాయని, వాటి వాడకాన్ని వెంటనే ఆపేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. ఈవీఎంలతో మోసాలు జరుగుతుండడంతో వాటి స్థానంలో పాతకాలం నాటి బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల యూపీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ ఘోర పరాజయం తర్వాత తొలుత బీఎస్పీ చీఫ్ మాయావతి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

తర్వాత ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా జత కలిశారు. ఇప్పుడు ములాయం కూడా ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, ఈవీఎంలపై వివరించేందుకు ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో శుక్రవారం  సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ములాయం ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News