: 67 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ క్రికెటర్
ముంబై యూనివర్సిటీ అంతర కళాశాలల టోర్నీలో యువ క్రికెటర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అనితర సాధ్యమైన ఫీట్ ను యువ బ్యాట్స్‌మన్ రుద్ర దండే సాధించి, సంచలన సృష్టించాడు. ఈ టీ20 మ్యాచ్ లో విజృంభించి ఆడిన రుద్ర దండే తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. మాతుంగ జింఖానా గ్రౌండ్ లో పి.దాల్మియా, రిజ్వి కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రిజ్వి కళాశాల జట్టు ఓపెనర్ అయిన రుద్ర దండే శివాలెత్తి ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి, 67 బంతుల్లో 21 ఫోర్లు, 15 సిక్సర్లతో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.