: ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధరలు!


గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజూ అదే బాట పట్టాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.265 తగ్గి రూ.28,400 వద్ద ఉంది. కాగా, వెండి ధరలు సైతం తగ్గాయి. కిలో వెండి ధర రూ.205 తగ్గి రూ.38,200కు చేరింది. కాగా, అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం బంగార ధరల తగ్గుదలకు కారణం కాగా, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధరలు తగ్గాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News