: ప్రభాస్ తో చిన్న గొడవ కారణంగా మాట్లాడడం మానేశానంటున్న బాలీవుడ్ హీరోయిన్


ప్రముఖ నటుడు ప్రభాస్ కు 'బాహుబలి' సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయనతో మాట్లాడేందుకు పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపుతుండగా, ఆయనతో నటించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం చిన్న గొడవ కారణంగా మాట్లాడడం మానేశానని తెలిపి కలకలం రేపింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ చివర్లో ప్రభాస్ తో చిన్న గొడవ జరిగిందని, అప్పటి నుంచి అతనితో మాట్లాడడం మానేశానని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తో మాట్లాడలేదని చెప్పింది. 'బాహుబలి'లో ప్రభాస్ నటనను చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. గతంలో ప్రభాస్ నటనకి, ఇప్పటి ప్రభాస్ నటనకి చాలా తేడా ఉందని తెలిపింది. 'బాహుబలి'లో అద్భుతంగా నటించాడని కంగనా కొనియాడింది.

  • Loading...

More Telugu News