: నెల్లూరు చేరుకున్న నిషిత్ మృతదేహం
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహం నెల్లూరు చేరుకుంది. బంధువులు, అభిమానుల సందర్శనార్థం నిషిత్ భౌతికకాయాన్ని పట్టణంలోని స్వగృహంలో ఉంచారు. నెల్లూరులోని నారాయణ కళాశాల క్యాంపస్ లో నిషిత్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన నిషిత్ స్నేహితుడు రవిచంద్ర మృతదేహం ప్రకాశం జిల్లా టంగుటూరుకు చేరింది.