: రాష్ట్రపతి ఎన్నిక విషయంపై మమతా బెనర్జీకి ఫోన్ చేసిన సోనియా!


ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జరగనున్నరాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. తమ పార్టీ తరపున ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యూహాలు రచిస్తున్నారు.

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మూడు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, రాష్ట్రపతి అభ్యర్థి విషయమై మాట్లాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ రోజు సోనియా ఫోన్ చేశారు. వచ్చే సోమవారం భేటీ అవుదామని  చెప్పారు. కాగా, రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సోనియా భేటీ కాగా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ తో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News