: ‘బాహుబలి-2’ను వీక్షించనున్న జస్టిన్ బీబర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ చిత్రాన్ని ప్రముఖ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వీక్షించనున్నట్టు సమాచారం. వరల్డ్ టూర్ లో భాగంగా బీబర్ నిన్న అర్ధరాత్రి ముంబైకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ముంబైలోని డీవై పటేల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. మరో మూడు రోజుల పాటు భారత్ లోనే గడపనున్న బీబర్, ‘బాహుబలి-2’ చిత్రాన్ని చూస్తారని సమాచారం.