: పార్లమెంట్ లో తన బిడ్డకు పాలిచ్చిన ఆస్ట్రేలియా ఎంపీ!
ఆస్ట్రేలియా పార్లమెంట్ హాల్లో తన బిడ్డకు పాలిచ్చింది ఎంపీ లారిసా వాటర్స్. క్వీన్స్ లాండ్ లోని గ్రీన్ పార్టీకి చెందిన లారిసా తన రెండు నెలల కూతురు అలియా జాయ్ తో రెండు రోజుల క్రితం పార్లమెంట్ కు వెళ్లింది. ఓటింగ్ సమయంలో సదరు ఎంపీ తన బిడ్డకు పాలిచ్చింది. ఈ విషయాన్ని లారిసా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. పార్లమెంట్ లో తల్లిపాలు తాగిన మొదటి చిన్నారిగా తన కూతురు రికార్డులకెక్కడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల వల్ల తల్లులైన ఎంపీలకు ఈ వెసులుబాటు కల్పించారు.