: నిషిత్ నారాయణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, లోకేష్, ఏపీ, తెలంగాణ మంత్రులు


హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ ఆత్మకు శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా నుంచి సంతాపం ప్రకటించారు. నిషిత్ నారాయణ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మంత్రి నారాయణకు తన సంతాపం తెలిపారు. మంత్రి లోకేష్ ఈ విషయం తెలియగానే ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాదు బయల్దేరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు. పలువురు ఆయన నివాసానికి బయల్దేరారు. 

  • Loading...

More Telugu News